ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు... 'కమలం' మ్యాప్‌ను షేర్ చేసిన బీజేపీ

  • భారతదేశం 'మోదీమయం' అంటూ ట్వీట్
  • ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు గెలుపు కేవలం విస్తరణ కాదని వ్యాఖ్య
  • ప్రగతి పథంలో సాగేందుకు ప్రజలు బీజేపీపై చూపిన విశ్వాసానికి ప్రతీక అని ట్వీట్
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు నేపథ్యంలో బీజేపీ 'ఎక్స్' వేదికగా 'మోదీమయమైన భారత్' అని ట్వీట్ చేసింది. కమలం బెంగాల్‌ను కూడా చేరుకుందని పేర్కొంది. ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు గెలుపు కేవలం విస్తరణ కాదని, ప్రగతిపథంలో సాగేందుకు దేశ ప్రజలు తమపై చూపించిన విశ్వాసానికి ప్రతీక అని రాసుకొచ్చింది.

ఉత్తరాది నుంచి ఈశాన్యం వరకు మార్పు కొనసాగుతోందని, ఇప్పుడీ ప్రయాణంలో పశ్చిమ బెంగాల్ అనే అతిపెద్ద అధ్యాయం చేరిందని పేర్కొంది. మనందరం కలిసి 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మిద్దామని 'ఎక్స్' వేదికగా పిలుపునిచ్చింది. ఈ మేరకు బీజేపీ ఒంటరిగా, మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్న రాష్ట్రాలతో మ్యాప్‌ను పంచుకుంది.

హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయంటూ కాషాయం రంగుతో మ్యాప్‌ను ట్వీట్ చేసింది. దీని ప్రకారం, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మిజోరాంలలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి.

BJP
Bharatiya Janata Party
West Bengal
India political map
Modi
Indian states
BJP victory
2024 Elections

More Telugu News